Ketika Sharma: అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న కేతిక శర్మ!

  • July 26, 2023 / 08:40 PM IST

సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేవారు ఎవరికైనా సరే.. సక్సెస్ సాధించడంతో అనేది చాలా ముఖ్యం. ఒకవేళ సక్సెస్ దక్కలేదు అంటే…వాళ్ళ కెరీర్ డైలమాలో పడుతుంది. ఒకప్పుడు అంటే సక్సెస్ తో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే.. 3,4 ఏళ్ళ పాటు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ.

ఆ సినిమాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. ఆ సినిమా యావరేజ్ ఫలితం అందుకుంది అంటే ఆమె గ్లామర్ వలనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత ఈమె నాగశౌర్య తో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసింది. ఇవి డిజాస్టర్లుగా మిగిలాయి. వీటి ఫలితాలతో సంబంధం లేకుండా (Ketika Sharma) కేతిక శర్మకి బ్రో సినిమాలో నటించే అవకాశం దక్కింది.

ఈ చిత్రంలో ఆమె సాయి ధరమ్ తేజ్ కి జోడీగా కనిపించనుంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అలాగే త్రివిక్రమ్ కథ , స్క్రీన్ ప్లే అందించారు.. కాబట్టి ఈ సినిమా మినిమమ్ గ్యారెంటీ. కాబట్టి కేతిక గట్టెక్కేసినట్టే. అంతేకాకుండా తక్కువ టైంలో ముగ్గురు మెగా హీరోలతో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus