టాలీవుడ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్న నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ సినిమాల్లోకి వచ్చారు. బాలయ్య.. ఎన్టీఆర్‌కి నిజమైన నట వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలయ్య తన సినీ కెరీర్లో ప్రస్తుతం ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో.. ఎన్టీఆర్, బాలయ్య టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పటికీ ఎవ్వరూ సాధించలేని అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు అంటే (Nandamuri family) నందమూరి సినిమాలకు అడ్డా.. బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా.. ఇదే ఏలూరులో అంబికా మినీ థియేటర్లో 300కు పైగా రోజులు ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య సమరసింహారెడ్డి సినిమా కూడా ఇదే ఏలూరు సాయిబాలాజీ థియేటర్లో 200 రోజులు ఆడింది. ఎన్టీఆర్‌కు, బాలయ్యకు ఏలూరులో ఎన్నో శత దినోత్సవ సినిమాలు ఉన్నాయి.
విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌కు ఆ తర్వాత బాలయ్యకు 50కు పైగా డైరెక్ట్ అర్దశత దినోత్సవాలు ఏలూరులో ఉన్నాయి. ఒకే వంశం నుంచి రెండు తరాలకు చెందిన హీరోలకు చెందిన ఇద్దరి సినిమాలు 50 కి పైగా .. డైరెక్ట్‌గా 50 రోజులు.. అది కూడా ఒకే సెంటర్లో ఆడటం అంటే మామూలు విషయం కాదు. అసలు మరే వంశానికి చెందిన హీరోలు కూడా ఈ రికార్డు విషయంలో దరిదాపుల్లో లేరు. టాలీవుడ్ లో ఇలాంటి అరుదైన రికార్డు ఈ తండ్రీకొడుకులకు ఉండటం విశేషం అని చెప్పుకోవాలి.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!