Rambha: రంభ వల్ల నరకం అనుభవించిన తండ్రి.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!
May 13, 2023 / 05:36 PM IST
|Follow Us
టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల నుండే వచ్చే హీరోయిన్స్ హవా పెద్దగా ఉండదు అని అందరు అంటూ ఉంటారు, దీని గురించి ఇప్పటికీ టీవీ లలో డిబేట్స్ నడుస్తూ ఉంటాయి, కానీ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు రంభ, విజయవాడ ప్రాంతం నుండి వచ్చిన రంభ, ఈవీవీ సత్యనారాణయన తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రంభ కి సినిమాల్లో అవకాశాలు వెల్లువలాగా కురిశాయి.ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల జోరు ఏ రేంజ్ లో ఉండేదో ఆ రోజుల్లో రంభ జోరు ఇంతకు పదిరెట్లు ఉండేవి.అతి తక్కువ సమయం లోనే సౌత్ లో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో నటించిన రంభ, బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు కూడా ఈమె చాలా క్యూట్ గా చక్కగా మాట్లాడుతుంది.
అయితే గత కొంతకాలం క్రితం ఆమె (Rambha) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన వల్ల బాధ పడినవాళ్ల గురించి యాంకర్ అడిగినప్పుడు రంభ ఇచ్చిన సమాధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అమె మాట్లాడుతూ ‘నేను ఎవరితో అయిన మా ఇంట్లో గొడవ పడితే కనీసం నెల రోజులైనా మాట్లాడకుండా ఉంటాను. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమాపణలు చెప్తాను కానీ, నా తప్పు లేకుండా నన్ను నిందిస్తే మాత్రం నేను వారితో మాట్లాడను.
అలా మా నాన్న విషయం లో ఒకసారి జరిగింది, అప్పట్లో నాన్న తో గొడవ జరిగినప్పుడు ఆరు నెలలు మాట్లాడకుండా ఉన్నాను, మా నాన్న అందువల్ల నరకం అనుభవించాడు, ఎందుకంటే ఆయనకీ నేను అంటే ఏంటో ఇష్టం, కానీ గొడవ జరిగినప్పుడల్లా నా కారణం గా ఆయన ఈ నరకం అనుభవించేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది.