మూడు పెళ్లిళ్ల హీరోయిన్ వనిత పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరబ్బా?

  • July 27, 2020 / 03:23 PM IST

కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘దేవి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వనిత విజయ్ కుమార్.. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈమె మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఈమె మూడో పెళ్లి చేసుకున్న పీటర్ కు కూడా ఇది రెండో పెళ్లి. అందులోనూ అతని మొదటి భార్య ఎలిజబెత్ కు కూడా విడాకులు ఇవ్వలేదట. దాంతో ఆమె వనిత, పీటర్ పై కేసు వేసింది. ఇక వనిత మూడో పెళ్లి గురించి అక్కడి సినిమా పెద్దలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికీ ఆ ఇష్యూ సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల వనిత కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో వనిత పై ఒక వ్యక్తి చెయ్యి వేసి ఉన్నాడు. పైగా వనిత చేతిలో మందు గ్లాస్ కూడా ఉంది. దాంతో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరా? అనే డిస్కషన్లు మొదలయ్యాయి. దాంతో వనితనే స్వయంగా ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చింది.

‘నా భుజం పై చెయ్యి వేసిన వ్యక్తి… నాకు అత్యంత సన్నిహితుడు అలాగే మంచి స్నేహితుడు కూడా..! అతని పక్కన అతని భార్య కూడా ఉంది. కానీ ఆవిడను కట్ చేసి కేవలం మేమిద్దరం ఉన్న ఫొటోనే పోస్ట్ చేశారు’ అంటూ వనిత చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus