Bhumika, Reema Sen: సీన్ రివర్స్ అయ్యింది.. రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టరే..!!

  • July 15, 2022 / 11:52 AM IST

సినీ పరిశ్రమలో ఎవరో చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం కామన్ గా జరిగేదే. బిజీగా ఉండటం, డేట్స్ కుదరకపోవడం, కథ నచ్చకపోవడం…. ఇలా కారణం ఏదైనా సరే. ఓ హీరో/ హీరోయిన్ చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం అవి బ్లాక్ బస్టర్ కావడం వంటి ఘటనలు ఎన్నో సార్లు జరిగింది. చివరికి అయ్యో చేసుంటే బాగుండేదేమో అని బాధపడటం .. బ్యాడ్ లక్ అని సరి పెట్టుకోవాల్సిందే. ఇలాంటి కొన్ని ఘటనలు సీనియర్ హీరోయిన్ భూమిక జీవితంలో కూడా జరిగింది.

ఆమె వదులుకున్న సినిమాలు మరొకరు చేసి సూపర్ హిట్ కొట్టారట. ఈ విశేషాలు దర్శక నిర్మాత ఎం ఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’ సినిమాలకు తొలి నుంచి భూమికను హీరోయిన్ గా అనుకున్నారట. ఈ రెండు సినిమాల కథలను ఆమెకు చెప్పగా.. భూమికకి ‘ఒక్కడు’ నచ్చిందని, మనసంతా నువ్వే రిజెక్ట్ చేసిందని ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇక రీమాసేన్ కు సైతం మనసంతా నువ్వే, ఒక్కడు రెండు స్టోరీలు చెప్పగా..

ఆమెకు ‘మనసంతా నువ్వే’ నచ్చగా.. ‘ఒక్కడు’ ను రిజెక్ట్ చేసిందని ఆయన చెప్పారు. అలా రీమాసేన్ కు ‘ఒక్కడు’, భూమిక కు ‘మనసంతా నువ్వే’ మిస్సయ్యాయి. పవన్ కల్యాణ్ సరసన ఖుషీ, ఎన్టీఆర్ సరసన సింహాద్రి, మహేష్ సరసన ‘ఒక్కడు’ లో నటించిన భూమిక స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. అవి వీరి ముగ్గురి ఏడో సినిమాలు కావడం విశేషం. అయితే ఈ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడంలో భూమిక విఫలమయ్యారు.

ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ స్టోరీ సెలక్షన్ లో తప్పుల కారణంగా భూమిక అగ్రనటిగా కొనసాగలేక పోయారు. అనంతరం యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లాడారు. కొన్నాళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus