‘బ్రహ్మోత్సవం’ విషయంలో మహేష్ అలా బుక్కయిపోయాడట..!

  • April 18, 2020 / 05:38 PM IST

మహేష్ బాబు కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు ఎక్కువ ఉన్నప్పటికీ .. కొన్ని అండర్రేటెడ్ సినిమాలు ఉన్నాయి. ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ సినిమాలు ఆ కోవకి వస్తాయి. అయితే పీడకల లాంటి సినిమాలు మాత్రం ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ ..వంటివే అని చెప్పాలి. ఇందులో ‘ఆగడు’ అనే చిత్రం మహేష్ ఫ్యాన్స్ కు అయినా కొంతమేర నచ్చే అవకాశం ఉంటుందేమో కానీ … మహేష్ నిర్మాత కూడా మారి తీసిన సినిమా ‘బ్రహ్మోత్సవం’ ఆయనకి ఇప్పటికీ నిద్ర లేకుండా చేసేదే అని చెప్పాలి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల… మళ్ళీ ఈ కథని డైరెక్ట్ చేసినా ఇంత చెత్తగా తియ్యడేమో అనుమానం కలుగక మానదు.

నిజానికి ఈ సినిమా ప్రారంభానికి ముందే మహేష్ ను చాలా మంది హెచ్చరించారట. నిజానికి శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రం కథని ముందు ఎన్టీఆర్ కి చెప్పాడట. అయితే ఏడు తరాలు… కుటుంబం కోసం దేశ యాత్రలు.. అందులోనూ కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం.. ఇవన్నీ చెక్ చేసుకుని ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసాడట. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని మొదట నిర్మించాలి అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ వద్దనేసరికి తప్పుకున్నాడట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి హిట్ ఇవ్వడంతో .. ఆ ఏడు తరాలు అనే లైన్ కి మహేష్ ఓకే చెప్పేసాడట.

మరోపక్క దిల్ రాజు కూడా ఓ సందర్భంలో ఈ కథ మీకు అంత కరెక్ట్ కాదు అని కూడా మహేష్ తో చెప్పారట. అయినా మహేష్ అర్ధం చేసుకోలేదు. స్క్రిప్ట్ ప్రొపర్ గా లేకుండానే 60 శాతం షూటింగ్ అయిపోయిందట. అప్పటికీ టెక్నీషియన్ లు.. ఇక రష్ చూసిన పరిచూరి బ్రదర్స్ మళ్ళీ రీషూట్ చేయడం బెటర్ అని చెప్పినా మహేష్ ఏ డెసిషన్ తీసుకోలేకపోయాడు అని … చివరికి అది డిజాస్టర్ అవ్వడం పక్కన పెట్టి … టీవీల్లో కూడా చాలా మంది టైం పాస్ కైనా చూడలేనంత దారుణమైన ఫలితాన్ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమాకి ముందు నుండీ ఎన్నో సిగ్నల్స్ వచ్చినా మహేష్ జాగ్రత్త పడలేకపోయాడు అని అప్పట్లోనే పెద్ద టాక్ నడిచింది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus