Ileana: ఇలియానా టాలీవుడ్ కు దూరం అవ్వడం వెనుక అంత కథ ఉందా?

  • November 9, 2022 / 07:36 PM IST

2006 లో సంక్రాంతి కానుకగా విడుదలైన దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ ఇలియానా. వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంతో ఇలియానాతో పాటు రామ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు అతను ఓ తమిళ షార్ట్ మూవీలో నటించాడు.అత్యధిక కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు ఆడిన మూవీగా కూడా దేవదాసు రికార్డులు సృష్టించింది.

మొదటి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే పోకిరి మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఇలియానా. ఈ చిత్రం కోసం ఆమె కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇచ్చింది. ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్టు అవ్వడంతో ఇలియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలు ఇలియానా ని లక్కీ హీరోయిన్ గా భావించారు.నిర్మాతలు అయితే ఈమెకు భారీ అడ్వాన్స్ లు ఇచ్చి తమ సినిమాల్లో నటించమని కోరేవారు.

ఇలియానా ఖాతాలో జల్సా,జులాయి వంటి హిట్లు ఉన్నాయి. టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న మొదటి హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది ఇలియానా. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆమెను పారితోషికం తగ్గించుకోమని అడిగిన నిర్మాత లేడు. అయితే సడన్ గా సౌత్ సినిమాలకు ఈమె దూరమైంది. బాలీవుడ్ కు దగ్గరైంది. అందుకు ఇలియానాకి బాలీవుడ్ పై ఉన్న మోజే కారణం అని అంతా అనుకున్నారు. కానీ కాదు. ఆమె ఓ హీరోతో ప్రేమ, డేటింగ్ వంటి వ్యవహారాలు నడిపిందట.

ఇలియానా ఆ టైంలో ఆ హీరో వల్ల ప్రెగ్నెన్సీ ధరించినట్లు కూడా టాక్ నడిచింది. ఆ హీరో కూడా ఇలియానా ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. కాకపోతే అతని ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అందుకే అతను ఇలియానా ని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ఇలియానాని ఎలాగైనా ఆ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ హీరో కుటుంబానికి బంధువు అయిన బడా నిర్మాత ప్రయత్నించాడు. కానీ అతని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ కారణాలతో ఇలియానా టాలీవుడ్ కు దూరమైంది అని తెలుస్తుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus