‘జయం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దిల్’ అనే చిత్రంలో నటించాడు నితిన్. ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు కాగా.. రాజు,గిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు మన దిల్ రాజు. 2003 ఏప్రిల్ 4న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.అంటే నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు కావస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
నిర్మాత దిల్ రాజు కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారాయన. ఇదిలా ఉండగా.. ‘దిల్’ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తికావస్తున్నా ఇప్పటికీ జనాలు టీవీల్లో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ చిత్రంలో నటించిన కొంతమంది నటీనటులు ఈరోజు ప్రాణాలతో లేకపోవడం కొంత ఇబ్బంది పెట్టే అంశం. ‘దిల్’ సినిమాలో నటించి ఈరోజు ప్రాణాలతో లేని నటీనటులు ఎవరో ఓ లుక్కేద్దాం :
1) ఎం.ఎస్.నారాయణ :
ఈ సినిమాలో ప్రిన్సిపాల్ పుల్లారావు పాత్రలో నటించి నవ్వులు పూయించారు. 2015 లో ఆయన మరణించారు.
2) చలపతి రావు :
ఈ చిత్రంలో హీరో నితిన్ (శ్రీను పాత్ర) తండ్రి పాత్రలో చలపతి రావు కనిపించారు.సినిమా కథని మలుపు తిప్పే పాత్ర ఇది. అయితే 2022 డిసెంబర్ లో చలపతి రావు మరణించారు.
3) వేణు మాధవ్ :
ఈ సినిమాలో హీరో మావయ్య పాత్రలో(వేణు అనే పాత్ర) లో ఈయన కనిపించి బాగా కామెడీ పండిస్తారు. సినిమా మొత్తం కనిపించే పాత్ర ఇది. 2019 లో వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో మరణించారు.
4) రాజన్ పి.దేవ్ :
నందిని( హీరోయిన్ నేహా) తాత పాత్రలో ఈయన కనిపిస్తారు. ఈయనది చాలా పవర్ ఫుల్ రోల్. అయితే 2009 లోనే ఈయన మరణించడం జరిగింది.
5) రాళ్ళపల్లి :
ఈ చిత్రంలో టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ఎంప్లాయిగా ఆయన కనిపించి కామెడీ పండిస్తారు. కానీ ఒక్క సీన్ లోనే ఈయన కనిపిస్తారు. ఇక 2019 లో ఈయన మరణించడం జరిగింది.
6) ఆహుతి ప్రసాద్ :
పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈయన కనిపిస్తారు. ఇక 2015 లో ఈయన మరణించడం జరిగింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?