Prabhas: ప్రభాస్ మూవీ రీ రిలీజ్ లో ఆ రేంజ్ కలెక్షన్లను సాధిస్తుందా?

  • August 11, 2023 / 06:41 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఆకాశమే హద్దుగా క్రేజ్ పెరగగా ప్రభాస్ సినిమా హిట్టైనా, ఫ్లాపైనా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సునాయాసంగా సాధిస్తూ ఇండస్ట్రీ వర్గాలను ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు మరీ పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయంటే ప్రభాస్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు కళ్లు చెదిరే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ప్రభాస్ ఫ్లాప్ సినిమాలలో ఒకటైన యోగి సినిమా కూడా రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రభాస్ (Prabhas) వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన 4కే వెర్షన్ లో యోగి మూవీ రీ రిలీజ్ కానుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. జైలర్, భోళా శంకర్ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం అవుతుండటంతో యోగి సినిమాకు థియేటర్లు దొరకడం సులువైన విషయం కాదు.

యోగి మూవీ బాగానే ఉన్నా ఈ సినిమా క్లైమాక్స్ వల్ల ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని చాలామంది భావిస్తారు. క్లైమాక్స్ మరో విధంగా ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్ లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus