Star Hero: హాలీవుడ్ స్టార్ ఎన్ని కోట్లు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
June 16, 2023 / 08:52 PM IST
|Follow Us
హాలీవుడ్ స్టార్ జానీడెప్ వ్యక్తిగత విషయాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుంచి మిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలని జానీడెప్ నిర్ణయించాడు. కోర్టులో తన మాజీ భార్య హెర్డ్ పై డెప్ విజయం సాధించి 2 మిలియన్ డాలర్లను (రూ.8 కోట్లు) పొందాడు. అయితే ఈ మొత్తాన్ని ఐదు స్వచ్ఛంద సంస్ధలకు ఇవ్వనున్నాడు. ఒక్కో చారిటీకి 2 లక్షల డాలర్ల చొప్పున ఆయన పంచేయనున్నారు.
అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇలా ఐదు సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని వెచ్చించనున్నాడని తెలిసింది. మేక్ ఏ ఫిల్మ్ ఫౌండేషన్, ద పెయింటెడ్ టర్టిల్, రెడ్ ఫెదర్, మార్లన్ బ్రాండోస్ కు చెందిన టెటిరో సొసైటీ చారిటీ, అమెజానియా ఫండ్ అలియన్స్ సంస్థలను జానీ డెప్ ఎంపిక చేసుకున్నాడు. ఈ ఐదు సంస్థలకు 2 లక్షల డాలర్ల చొప్పున పంచిపెట్టనున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే దర్శకులు, రచయితలు, నిర్మాతలు, వారి పిల్లలకు కూడా ఈ విరాళం అందుతుందని చెప్పారు.
కాగా.. అంబర్ హెర్డ్, జానీ డెప్ ఒకరిపై ఒకరు న్యాయపోరాటానికి దిగడం తెలిసిందే. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసిన కథనానికి వ్యతిరేకంగా ఆయన దావా వేశారు. అదే సమయంలో 36 ఏళ్ల నటి అంబర్ హర్డ్.. తన మాజీ భర్త జానీ డెప్ ఆరోపణలు బూటకమని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.
(Star Hero) జానీడెప్ – అంబర్ హర్డ్ 2011లో ది రమ్ డైరీ అనే సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలుసుకున్నారు. అలా మొదలైన స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. కానీ వారు ఎంతో కాలం కలిసి ఉండలేదు. రెండు సంవత్సరాలకే కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటానికి దిగారు. జానీ డెప్ భార్యపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు. లైంగిక ఆరోపణ…మాదక ద్రవ్యాల దుర్వినియోగం అభియోగాలపై ఆయన మీద కేసు నమోదైంది.
ఆ తర్వాత మీడియాలో రకరకాల కథనాల నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం నడించింది. ఇరువురు ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులు వేసుకున్నారు. ఇందులో జానీ డెప్ విజయం సాధించడంతో మాజీ భార్య పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ఆ డబ్బునే ఇప్పుడు జానీ డెప్ ఛారిటీలకు పంచిపెట్టనున్నారు.