పాటమ్మ గుండె చప్పుడు ఆగిపోయే…కన్నీళ్లు తెప్పిస్తున్న బాలుపై పాట
September 28, 2020 / 06:52 PM IST
|Follow Us
నిన్నటితో భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. సంగీత ప్రియుల గుండె చప్పుడైన బాలు గొంతు శాశ్వతంగా మూగబోయింది. తన పాటల నిధిని అభిమానులకు కానుకగా ఇస్తూ బాలు సుదూర తీరాలకు చేరుకున్నారు. సుదీర్ఘ కాలం మృత్యువుతో పోరాడిన బాలు చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి శోకించని సంగీత ప్రియుడు లేడు. దేశవ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా బాలు అకాల మరణాన్ని తలచుకుంటూ వేదనతో ‘పాటమ్మ గుండె చప్పుడు ఆగిపోయే’ పాటను రూపొందిచారు.
యువ సంగీత దర్శకుడు అంజి పమిడి ఈ హృదయవిదారక పాటను స్వయంగా పాడడంతో పాటు రచించి, స్వరాలు అందించారు. బాలు మరణం సంగీత ప్రపంచాన్ని, సంగీత ప్రియులను ఎంత ఆవేదనకు గురి చేసిందో ఆయన పాటలో చక్కగా వివరించారు. కదిలించే లిరిక్స్ తో పాటు హృదయాన్ని పట్టిపిండేలా ఉన్న లిరిక్స్ బాలు గొప్పతనాన్ని, ఆయన లేని లోటును గుర్తు చేస్తున్నాయి.
యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ బాలు అభిమానులు ఆయనకు ఇచ్చిన మరో గౌరవంగా భావిస్తున్నారు. మధుర ఆడియో ఈ సాంగ్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం బాలు ఎంజీఆర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడువగా, నిన్న చెన్నై ఫార్మ్ హౌస్ లో బాలు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి అయ్యాయి.