అబ్బో పాజిటివ్ రెస్పాన్స్.. శర్వాకి ఈ సారి కచ్చితంగా హిట్టు పడేలా ఉంది..!

  • March 3, 2022 / 03:17 PM IST

మ‌హిళ‌లు ఎక్కువగా వుండే ఉమ్మ‌డి కుటుంబంలో వార‌సుడిగా ఒకే మ‌గాడు ఉంటే అత‌ని పై వారి ఆప్యాయ‌త‌, అనురాగాలు ఎలా వుంటాయో.. పర్సనల్ లైఫ్ కు, మ్యారీడ్ లైఫ్ కు సంబంధించిన ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయనే పాయింట్‌తో `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` చిత్రం రూపొందింది. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. శ‌ర్వానంద్‌ కు జోడీగా ర‌ష్మిక మందన్న న‌టించగా…. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మార్చి 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్, ట్రైలర్లు అన్నీ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ వింటుంటే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ఆసక్తిని కల్గిస్తుంది. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం. సినిమాలో మంచి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇమిడి ఉన్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగున్నాయి. చాలా కాలం తర్వాత ఒక చక్కటి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదల ఆలస్యం అయినప్పటికీ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం కచ్చితంగా థియేటర్లలోకి రప్పిస్తుంది’ అంటూ వారు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వారు జారీ చేశారు.

ఇక ఈ చిత్రం రన్ టైం వచ్చేసి 141 నిమిషాలు కావడం విశేషం. సెన్సార్ టాక్ తో వరుస ప్లాపుల్లో ఉన్న శర్వానంద్ కు.. ఈ చిత్రం హిట్ అయ్యి రిలీఫ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus