వాడు చేసిన పనికి చనిపోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరోయిన్!

  • November 2, 2018 / 11:31 AM IST

ప్రస్తుతం ఎవరి నోట విన్న మీ టూ అనే మాటే వినిపిస్తుంది. ఇందులో భాగంగానే సినీ పరిశ్రమలో తెర వెనుక జరిగే కొన్ని విషయాలు బయటకి వస్తుండటంతో పెద్ద దుమారం చెలరేగుతుంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ అహనా కుమ్ర కూడా మీ టూ అంటూ కొన్ని తాను పడిన కష్టాల గురించి చెప్పింది.

అహనా కుమ్ర “లిప్ స్టిక్ అండర్ మై బుర్కా” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తానూ 5 సంవత్సరాల క్రితం మానసిక క్షోభ అనుభవించానని ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నానని తన ఆవేదనని వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో కొన్ని గ్రూపులు ఉంటాయని మనం ఇక్కడ ఉండాలంటే నచ్చకున్నా ఏదో ఒక గ్రూప్ లో ఉండి తీరాల్సిందేనని ఆలా నేను కూడా నాకు ఇష్టం లేకున్నా ఒక గ్రూప్ లో పడిపోయానని అప్పుడు ఒకడు నన్ను చెప్పుకోలేని చోట తాకితే ఎవరికీ చెప్పుకోలేక నాలోనేను కుమిలిపోయానంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒక ప్రముఖ డైరెక్టర్ నీకు వంద కోట్లు ఇస్తే డాగ్ తో సెక్స్ చేస్తావా అని చాలా నీచంగా మాట్లాడంటూ తన బాధని చెప్పుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus