Aamir Khan: అప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది: అమీర్ ఖాన్
August 11, 2022 / 12:30 PM IST
|Follow Us
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సినిమా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది.ఇలా నాలుగు సంవత్సరాల తర్వాత ఈయన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు అమీర్ ఖాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత తన సినిమా విడుదల కావడంతో తనకు ఎంతో ఆందోళనగా ఉందని వెల్లడించారు. ఈ సినిమా గురించి ఆలోచించడంతో తనకు గత 48 గంటల నుంచి నిద్ర కూడా పట్టడం లేదని బహుశా ఆగస్టు 11వ తేదీ తర్వాత నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఈయన తెలిపారు.
ప్రస్తుతం తన మైండ్ మొత్తం ఓవర్ డ్రైవ్ చేస్తూ ఉందని, తనను తాను సమర్ధించుకోవడానికి ఆన్లైన్ గేమ్స్ ఆడటం పుస్తకాలు చదవడం వంటివి చేస్తున్నానని ఈ సందర్భంగా అమీర్ ఖాన్ తెలిపారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనాకపూర్ నటించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
గచైతన్య సైతం తాను నటించిన థాంక్యూ సినిమా ఫ్లాప్ కావడంతో ఆశలన్నీ సినిమాపై పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున నాగచైతన్య ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.మొత్తానికి నాగచైతన్య ఫస్ట్ బాలీవుడ్ సినిమానే మంచి విజయం అందుకుందని చెప్పాలి. ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో అమీర్ ఖాన్ ఫ్రెండ్ గా సందడి చేస్తున్నారు.