Abhiram: ఆ విషయంలోనే ఆ దర్శకుడు అభిరామ్ ను టార్చర్ చేశాడా?
June 2, 2023 / 12:20 PM IST
|Follow Us
దగ్గుపాటి అభిరామ్ ఈ హీరో రామానాయుడు మనవడు,సురేష్ బాబు కోడుకు, రానా తమ్ముడు కంటే కూడా శ్రీరెడ్డి విషయంలో అందరికి తెలిశాడు. అప్పటి వరకు అభిరామ్ ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. ఓకేసారి శ్రీరెడ్డి విషయంలో 10 సినిమాలు తీసిన హీరో కూడా రాని ఫ్రేమ్ అభిరామ్ కు వచ్చిందని చెప్పడంలో సందేహాం లేదు. ఆ విషయంలో ఈ హీరో ట్రెండ్ అయ్యాడు.
ఇప్పుడు అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా ‘అహింస’.
ఈ చిత్రంతో అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయం కానున్నాడు. సదా కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో గీతిక తివారీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరవ్వడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా అభిరామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దర్శకుడు తేజ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తేజ కొత్త ఎంటర్టైనర్లను తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుతాడని, వాటిద్వారా హిట్ కొడతాడని పేరుంది.
ఈ క్రమంలో తాజాగా అయన ఇకపై ఇండస్ట్రీ లో కొనసాగడం కష్టమని ఇండస్ట్రీ జనాలు కూడా చర్చించుకుంటున్నారు. కోపమొస్తే తను చెప్పినట్టు చేయకుంటే హీరోయిన్లపై కూడా తేజ చేయి చేస్తాడని అంటున్నారు. ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అహింసా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రస్తావిస్తే.. ‘‘నేను కొట్టడం చూశావా?’’ అని తేజ తిప్పికొట్టారు.
షూటింగ్ జరుగుతున్నప్పుడు తేజ అందరి ముందు మైక్ లో నన్ను తిట్టారు. నీ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ నేను ఆడియన్స్ కోసమే సినిమా తీస్తాను. దృష్టి పెట్టి నటించు కేకలు వేశారు. హీరోయిన్ ని ఎత్తుకొని నేను పరుగెత్తే సన్నివేశం ఉంది. నేను ముందుకు పడిపోయాను. మోకాళ్ళకు దెబ్బలు తగిలాయి. ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిన్ను శ్రీ రెడ్డి కంటే ఎక్కువ టార్చర్ పెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.