Ahimsa OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘అహింస’ మూవీ.. ఎందులో అంటే?
December 5, 2023 / 05:00 PM IST
|Follow Us
‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత రామానాయుడు మనవడు, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు, సూపర్ సక్సెస్ ఫుల్ నటుడు విక్టరీ వెంకటేష్ కు కూడా కొడుకు వరస, పాన్ ఇండియన్ యాక్టర్ రానాకి తమ్ముడు అయిన అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘అహింస’. సెన్సేషనల్ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అనేక సార్లు వాయిదా పడుతూ ఈ ఏడాది జూన్ 2 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
ప్రేక్షకులు కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అద్భుతాలు ఈ సినిమా చేయలేదు. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యి చాలా నెలలు గడిచిన ఈ సినిమాని ఓటీటీలో అయినా మిస్ అవ్వకుండా చూడాలి అని రెగ్యులర్ మూవీ లవర్స్ భావించారు. కానీ ఎందుకో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కూడా చాలా డిలే అయ్యింది. ఇక ప్రేక్షకులు ‘అహింస’ చిత్రాన్ని మర్చిపోయారు అనుకున్న టైంలో ..
ఇప్పుడు చాలా సైలెంట్ గా ఓటీటీకి వచ్చింది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన బావా మరదళ్లు రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ). ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కంటే బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. సరిగ్గా వీరి నిర్చితార్థం జరిగి.. త్వరలో పెళ్లి చేసుకుంటారు అనగా అహల్య పై అత్యాచారం జరుగుతుంది.
చేసింది ఊరి పెద్ద కొడుకులు. వాళ్ళ మీద అహింసాత్మకంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటాడు రఘు. అహింస పోరాటం అతడికి న్యాయాన్ని చేకూర్చిందా? అందుకోసం అతడు పడిన కష్టాలు ఏమిటి అనేది’ మిగిలిన కథ. పేరుకు ‘అహింస’ కావచ్చు కానీ ఇందులో చాలా హింస ఉంటుంది. ఓపిక ఉంటే ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ సాయంతో ఈ సినిమాని ఓటీటీలో ట్రై చేయండి.