ఆచారి అమెరికా యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్ | విష్ణు మంచు | ప్రజ్ఞ జైస్వాల్

  • January 20, 2018 / 05:40 AM IST

విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది.  ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర టీజర్ మరియు పాటల ప్రోమోలకు విశేష స్పందన వస్తుంది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం జనవరి 26 న విడుదల కానుంది. జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus