మెగాస్టార్ సినిమా.. అంత పెట్టి కొంటారా..?

  • February 2, 2021 / 06:10 PM IST

కరోనా నేపథ్యంలో సినిమాల బిజినెస్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో సినిమాలను హక్కులను కొనలేరని.. కాబట్టి రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడు రివర్స్ లో పెద్ద సినిమాలకు పెద్ద మొత్తంలోనే రేట్లు చెబుతున్నారు. కరోనా కన్నా ముందు వసూలు చేసిన ఫిగర్లు చూపించి.. అంతకుమించి ఇస్తేనే సినిమా ఇస్తామని అంటున్నారట. దాంతో బయ్యర్లు షాకవుతున్నారు. పెద్ద సినిమాలతో పోలిస్తే మీడియం సినిమాల పరిస్థితి కాస్త బెటర్ గా ఉందని తెలుస్తోంది.

నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా హిట్ అయినప్పటికీ.. ‘రంగ్ దే’ సినిమాను ఆంధ్రలో తొమ్మిది కోట్లకు ఇచ్చేశారు. నిజానికి ఈ సినిమాకి 11 నుండి 12 కోట్ల రేంజ్ లో అమ్మాలని అనుకున్నారు కానీ కరోనా కారణంగా తక్కువకి ఇచ్చారు. ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ చిత్రాలు ‘ఆచార్య’, ‘పుష్ప’ సినిమాల విషయంలో మాత్రం భారీ మొత్తాన్ని కోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

కొరటాల దర్శకత్వం.. రామ్ చరణ్ కీలక పాత్ర సినిమాపై హైప్ ని మరింతగా పెంచేశాయి. ఈ సినిమా విషయంలో మేకర్లు నైజాం రైట్స్ ను రూ.35 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట. తమని సంప్రదిస్తోన్న బయ్యర్లకు ఇదే మొత్తాన్ని చెబుతున్నారట. నైజాంలో మెగాస్టార్ గత చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే ‘ఆచార్య’ సినిమాను రూ.35 కోట్లకు తక్కువకి ఇవ్వకూడదని అనుకుంటున్నారు. పైగా రీసెంట్ గా జరిగిన ఓ ఇష్యూ కారణంగా నైజాంలో పోటీ పెరిగింది. దీంతో రేట్లు కూడా అదే రేంజ్ లో పలుకుతున్నాయి. మరి ఇంత మొత్తం పెట్టి మెగాస్టార్ సినిమాను ఎవరు కొంటారో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus