Acharya Collections: ‘ఆచార్య’ కలెక్షన్లు… 5వ రోజున కొంతలో కొంత నయం..!
May 4, 2022 / 04:02 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండీ భారీగా నమోదవడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కానీ ఆ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. తొలి 3 రోజులతో పోలిస్తే 4వ రోజున చాలా దారుణంగా పడిపోయాయి. అయితే 5 వ రోజున రంజాన్ హాలిడే వల్ల కొంత పర్వాలేదు అనిపించింది. ‘ఆచార్య’ 5 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
10.66 cr
సీడెడ్
5.90 cr
ఉత్తరాంధ్ర
4.65 cr
ఈస్ట్
3.29 cr
వెస్ట్
3.38 cr
గుంటూరు
4.16 cr
కృష్ణా
2.96 cr
నెల్లూరు
2.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
37.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.80 cr
ఓవర్సీస్
4.89 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
45.44 cr
‘ఆచార్య’ చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.45.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.88.56 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. చిరు, కొరటాల ఇమేజ్ లను బట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి కానీ రెండో రోజు,మూడో రోజు బాగా పడిపోయాయి.
ఇక 4వ రోజు ఈస్ట్, గుంటూరు వంటి ఏరియాల్లో 0 షేర్ నమోదవ్వడం ట్రేడ్ కు సైతం షాకిచ్చింది.నిన్న రంజాన్ పండుగ సెలవు కలిసొచ్చి కొంతలో కొంత నయం అనిపించింది కానీ కనీసం రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకునేందుకు ఇవి సరిపోవు.