Koratala Siva: ఆచార్య ఎఫెక్ట్.. స్టార్స్ కొరటాలను నమ్ముతారా?
May 2, 2022 / 11:41 AM IST
|Follow Us
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఫలితం గురించి మేకర్స్ కు, ప్రేక్షకులకు దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పవచ్చు. ఈ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రంజాన్ సెలవు సైతం ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు ఆచార్య ఫలితం టాలీవుడ్ స్టార్స్ ను తెగ టెన్షన్ పెడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా కొరటాల శివ దర్శకత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చే విషయంలో స్టార్ హీరోలు వెనుకడుగు వేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఆచార్య రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోయినా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి ఎటువంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ సినిమాతో కొరటాల శివ మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కొరటాల శివ రెమ్యునరేషన్ పై కూడా ఆచార్య ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.
సాధారణంగా ఒక్కో సినిమాకు కొరటాల శివ 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా జూన్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుండగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. కొరటాల శివ కొత్త తరహా కథ, కథనాలను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా అడుగులు వేస్తున్నారు.
150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత సినిమాలతో కొరటాల శివకు ప్రశంసలు దక్కితే ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.