Acharya First Review: ‘ఆచార్య’ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ వచ్చేసింది..!
April 26, 2022 / 05:41 PM IST
|Follow Us
‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా రాంచరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా రాంచరణ్ ఈ మూవీలో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతనికి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీకి సంబంధించిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ట్రైలర్ కూడా బాగుంది. చిరు- చరణ్ లు కలిసి నటించిన మూవీ కావడంతో మొదటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సెన్సార్ సభ్యులు, విశ్లేషకుడు అయిన ఉమర్ సంధు ‘ఆచార్య’ ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు. చిరు, చరణ్ ల కాంబో మాస్ ఆడియన్స్ కు లార్జ్ డోస్ లో ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడం గ్యారెంటీ అట.
మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరించడంలో నూటికి నూరుపాళ్లు ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఉమర్ అన్నాడు. ‘ఆచార్య’ ఈ రంజాన్ సీజన్ కు రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమని అంటున్నాడు.మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇదని బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అని భరోసా ఇస్తున్నాడు ఉమర్. అంతేకాకుండా ఈ మూవీని వీక్షించాక 4/5 రేటింగ్ కూడా అతను ఇచ్చేసాడు. రాంచరణ్ నిడివి 45 నిమిషాలు ఉంటుందని ఓ సందర్భంలో అతనే(చరణ్) చెప్పుకొచ్చాడు.
సినిమా ప్రారంభమైన 25 నిమిషాల తర్వాత చిరు ఎంట్రీ ఉంటుందట. అటు తర్వాత కాస్త స్లోగా సాగుతుందని ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కు ఓ ఫైట్ ఉంటుందని అటు తర్వాత ఇంటర్వెల్ ఫైట్ కూడా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. అక్కడే సిద్ధ ఎంట్రీకి తగ్గ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని, అతని ఎంట్రీతో ఇంటర్వెల్ కార్డు పడుతుందని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ లో పాద ఘట్టం జనాలను ఇబ్బంది పెడుతున్న విలన్ ను అంతం చేసి సిద్ధ లక్ష్యాన్ని నెరవేర్చడానికి చిరు చేసే పోరాటాలు కూడా బాగుంటాయని తెలుస్తుంది.
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు సినిమాటోగ్రఫీ, సానా కష్టం పాట, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. అయితే ఉమర్ ఇచ్చిన రివ్యూలు నిజమవుతాయని గ్యారెంటీ లేదు. అతను ప్రతీ సినిమాని ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూ ఇస్తుంటాడు. ఇతని రివ్యూల పై నమ్మకం ఉన్నవారు వీటికి ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ ఆ సినిమా హీరోకి ఉన్న అభిమానులకు ఇతని రివ్యూలు మరింత జోష్ ను ఇస్తుంటాయి.