తాజాగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్… గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం గోపీచంద్ కోలీవుడ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జైపూర్ లోని మండవ ప్రాంతంలో జరుగుతుంది. ఈ రోజుతో అక్కడ చిత్రీకరణ పూర్తవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
గోపీచంద్ తో బైక్ చేజింగ్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయ్యిందట. దీంతో గోపీచంద్ కి స్వల్ప గాయాలు తగిలినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది గోపీచంద్ ను దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారట. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదని… ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత మిగిలిన చిత్రీకరణ జరుపుకోవచ్చని… అక్కడి ఫోర్జిస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారట. నిర్మాతలు గోపీచంద్ ని విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ.. గోపీచంద్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్ పూర్తి చేయాలని.. తెలిపాడంట. గత రెండేలుగా గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో ఈ చిత్రంతో ఎలాగైనా సరే మంచి హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చుస్తున్నాడని తెలుస్తుంది. .