టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పటికీ స్టార్ కమెడియన్ గా అలీ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే విషయం తెలిసిందే. ఏ పాత్రకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేసే అతి తక్కువమంది కమెడియన్లలో అలీ ఒకరని చెప్పవచ్చు. అలీకి కమెడియన్ గా మంచిపేరును తెచ్చిపెట్టిన సినిమాలలో ప్రేమఖైదీ ఒకటి. ఒక సందర్భంలో అలీ ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మద్రాస్ లో అనుభవించిన కష్టాలతో పోలిస్తే హైదరాబాద్ లో అనుభవించిన కష్టాలు అసలు కష్టాలే కావని అలీ అన్నారు.
మద్రాస్ లో స్ట్రగుల్స్ అనుభవిస్తే మాత్రమే స్టార్ కావడం సాధ్యమవుతుందని అప్పట్లో ఇండస్ట్రీలో చెప్పుకునేవాళ్లని అలీ వెల్లడించారు. డబ్బులు లేకపోవడంతో ఆరు నెలలు టీ, బన్నుతో గడిపానని అలీ పేర్కొన్నారు. మద్రాస్ లో ఉన్న సమయంలో ప్రేమ ఖైదీ మూవీ కోసం ఎంపికయ్యానని ఒకరోజు తాను లేని సమయంలో హైదరాబాద్ కు షూటింగ్ కు రావాలని రూమ్ లో ఉన్న తన స్నేహితునికి చెప్పి వెళ్లారని అలీ తెలిపారు. తాను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోవడంతో చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు ట్రైన్ టికెట్ తీసుకుని బయలుదేరానని అయితే సికింద్రాబాద్ స్టేషన్ కు కొంత దూరంలోనే చెకింగ్ వల్ల రైలు ఆగిపోయిందని అలీ అన్నారు.
షూటింగ్ కు టైమ్ కావడంతో పెట్టె పట్టుకుని రైలు పట్టాలపై రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లానని అలీ పేర్కొన్నారు. ఆ తరువాత ఫిల్మ్ నగర్ కు వెళ్లాలని చెబితే ఆటోవాళ్లు రాలేదని ఒకడు అన్నపూర్ణ స్టూడియో వరకు తీసుకెళతానని చెప్పగా తాను ఆ ఆటోలో వెళ్లి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దిగి ఫిల్మ్ నగర్ కు నడుచుకుంటూ వెళ్లానని అలీ వెల్లడించారు.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?