మరో విజయశాంతి కావాలనుకుంటుందా??

  • July 8, 2016 / 08:03 AM IST

టాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కోలా పాప్యులర్ అవుతూ ఉంటారు…అయితే అందులో యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాంకర్ విషయానికి వస్తే అనసూయా, రేష్మి లాంటి వాళ్ళు తమ అందాల సోయగాలతో ఒక ఊపు ఊపుతుంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో హేమా ఆంటీ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.

అసలైతే ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి….అంతేకాకుండా ఆ క్రేజ్ కు కారణం ఏంటి అంటే…అప్పట్లో ఈమె చేసిన హంగామా అని చెప్పక తప్పదు…ఇంతకీ ఆమె ఏం చేసింది అంటే…గతంలో తనను టీజ్ చేస్తున్నాడనని ఒకరిపై కేసు పెట్టి ఊతికి ఆరేసింది..తర్వాత మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా రాజేంద్రప్రసాద్, నాగబాబు ని దుమ్ముదులిపింది.. అంతే కాదు మీడియాల్లో పెద్ద హంగామానే సృష్టించింది. అదంతా పక్కన పెడితే….ఇప్పటివరకూ వదిన, అక్క, భార్య క్యారెక్టర్లతో మెప్పించిన హేమ ఇక విభిన్న క్యారెక్టర్లు  చేస్తాను అంటుంది. అంతేకాకుండా తనకు ఒక డ్రీమ్ రోల్ ఉంది అని చెబుతూనే…తన మనసులోని మాటను బయటపెట్టింది.

ఇంతకీ ఆంటీ డ్రీం రోల్ ఏంటి అంటే…తన పర్సనాలిటీ లేడీ డాన్, పోలీసు పాత్రలకు సరిపోతుందని అలాంటి పాత్రల్లో నటించాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. కరెక్ట్ గానే చెప్పింది కానీ….ఒకప్పుడు అంటే లేడీ ఒరియాంటెడ్ పాత్రలు వచ్చేవి…అందులో మన విజయశాంతి అక్క ఇరగదీసి నటించేది. మరి ఇప్పుడు ఆ సినిమాలు వచ్చెవే తక్కువ, మరి అలాంటి సినిమాల్లో నటించాలి అని మన హేమా ఆంటీ అంటుంది అంటే….మరో విజయశాంతి కావాలి అన్న ఆలోచన ఏమైన ఉందేమో ఆమెకు…చూద్దాం మరి ఆమె కల నెరవేరుతుందో లేదో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus