Lb Sriram: ఆ ముద్ర చెరిగిపోవడం కోసమే సినిమాలకు దూరమయ్యాను: ఎల్బీ శ్రీరామ్
December 5, 2022 / 01:29 PM IST
|Follow Us
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ ఎన్నో సినిమాలకు డైలాగ్ రచయితగా పనిచేశారు. అనంతరం ఈయన సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సుమారు కొన్ని వందల సినిమాలలో నటించిన ఎల్బీ శ్రీరామ్ గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తాజాగా ఈయన వెల్లడించారు.
అమలాపురంలోని అమర గాయకుడు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఘంటసాల విగ్రహాన్ని ఎల్బీ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చానని రచయితగా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగాలని తెలిపారు. సుమారు 500 సినిమాలలో హాస్యనటుడిగా నటించానని తెలిపారు.
ఇకపోతే గత ఆరు సంవత్సరాలుగా తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని అయితే ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం హాస్యనటుడు అనే ముద్ర నుంచి బయట పడటం కోసమే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. పావు గంటలో ఒక సందేశాత్మకమైన లఘు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఎంతో సంతృప్తిగా గడుపుతున్నానని తెలిపారు. ఇలా తన లఘు చిత్రాల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ ఆ లఘు చిత్రాలకు దర్శక నిర్మాత బాధ్యతలను చేపట్టానని ఈయన వెల్లడించారు.
ఇకపోతే ఆరు సంవత్సరాల నుంచి సుమారు 60 లఘు చిత్రాల ద్వారా ఎంతో సందేశాత్మకమైన అంశాలను సమాజానికి తెలియజేశానని ఇందులో తనకు చాలా సంతృప్తిగా ఉందని ఎల్బీ శ్రీరామ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.