Madhavan: నా ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లి చేసుకోవడమే : మాధవన్
November 23, 2023 / 03:21 PM IST
|Follow Us
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పలువురు స్టార్ హీరోలు కొన్ని కొన్ని విషయాలను ఓపెన్ గా చెప్పటం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా తమ సినిమా , సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కొందరు స్టార్ హీరోలు తమ గత తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా అదే లిస్టులోకి వచ్చాడు స్టార్ హీరో మాధవన్ . ఈయన పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినిమాలు అయినా సరే తనదైన స్టైల్ లో నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న హీరో.
రీసెంట్ గా ఈయన నటించిన సిరీస్ “ద రైల్వే మెన్” ఇందులో హీరోయిన్ జూహీ చావ్లా కూడా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ హీరోయిన్ జూహీ చావ్లా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..” నా అదృష్టం బాగుంది అందుకే ఈ సిరీస్ కు జూహీ చావ్లా ఓకే చెప్పారు .
అయితే అమె ఎక్కడ నో చెప్తుందో అనుకుని టెన్షన్ పడిపోయాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఖయామత్ సే ఖయామత్ టక్ అనే సినిమా చూసినప్పుడు నేను ఆమె అందానికి నటనకి ఫిదా అయిపోయాను. అప్పుడే మా అమ్మకి చెప్పాను నేను ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాను మమ్మీ అంటూ అని ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు.
అంతేకాదు అప్పుడు నా ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లడమే అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చాడు . కాగా ఇదంతా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన మాధవన్ హార్ట్ టచింగ్ కామెంట్స్ మాత్రం అభిమానులను ఎక్కడో టచ్ చేశాయి . ప్రెసెంట్ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని మాధవన్ (Madhavan) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.