ఇటీవల మోహన్ బాబు తన సొంత విద్యాసంస్థలకు రావాల్సిన ‘ఫీజు రీఎంబర్స్ మెంట్’ పై ప్రత్యేక పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు చంద్రబాబుకి వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేసాడు. తరువాత వైసీపీ పార్టీలో కూడా చేరడం అందరికీ షాకిచ్చింది. ఇదిలాఉంటే ఎప్పుడైతే వైసీపీ పార్టీలో మోహన్ బాబు చేరాడో అప్పటి నుండీ కొన్ని బెదిరంపు కాల్స్ రావడం మొదలయ్యాయట. అసలా తనకి కాల్స్ చేసి బెదిరిస్తున్న ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో తెలీక పోలీసులను ఆశ్రయించారట మోహన్ బాబు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ఈ విషయం పై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ కాల్స్ అన్నీ విదేశాల నుండీ వస్తున్నట్టు పోలీసులు చెప్పారని సమాచారం. అసలు ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నట్టు… ఇందులో ఎలాంటి కుట్ర ఉంది అనేది ప్రస్తుతం అన్ని చోట్ల చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి చెక్ బౌన్స్ కేసు వేసాడు. ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం చెక్ బౌన్స్ అయితే ఇప్పుడు కేసు వేయడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుందనేది చూడాల్సి ఉంది.