Nandu, Rashmi: రష్మీపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందు.. కానీ?

  • October 18, 2022 / 05:35 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నందు నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రష్మీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నందు రష్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రష్మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ కు రావడం లేదని నందు కామెంట్ చేశారు.

నవంబర్ 4వ తేదీన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కానుందని నందు వెల్లడించారు. ఆ తర్వాత నందు రష్మీ ఫోటోషూట్ జరుగుతున్న ప్లేస్ కు వెళ్లి హంగామా చేయగా ఆ తర్వాత రష్మీ కూడా నందుపై ఫైర్ అయ్యారు. రష్మీ స్పందిస్తూ నేను బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ కు రానని నాకు ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. అయితే ఆ తర్వాత రష్మీ, నందు ప్రాంక్ వీడియో చేశారని వెల్లడైంది.

బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ ప్రాంక్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అటు నందుకు, ఇటు రష్మీకి ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. రష్మీకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కాగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. రష్మీ ఈ సినిమాలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ప్రముఖ ఛానల్ లోని షోలతో బిజీగా ఉన్న రష్మీ ఆ ఛానెళ్లలోని షోల ద్వారా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus