Maa Elections: కులాల ప్రస్తావన పై సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్ వైరల్..!
August 3, 2021 / 05:25 PM IST
|Follow Us
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నో కాంట్రవర్సీలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మాటల యుద్ధాల నుండీ పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసుకుని గొడవలు పెట్టుకునే వరకు వెళ్తూనే ఉంటాయి. ఈసారి అంతకు మించి… అన్నట్టు సభ్యులు వ్యవహార శైలి ఉంది.ఇక ఈ టర్మ్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు అయిన సీనియర్ నరేష్… మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతు పలుకుతున్నట్టు చర్చ జరుగుతుంది.
దీనికి కారణం అందరికీ తెలిసిందే.ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు ఆయన దూరంగా ఉండడం. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే.ఈ విషయాన్ని నాగబాబు ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే ఇన్నేళ్ళలో చిరు నేరుగా ఎవ్వరికీ మద్దతు ఇచ్చినట్టు ప్రకటించింది లేదు.ఈసారి కూడా ఆయన అదే పద్దతిని ఫాలో అవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే నరేష్, బాలకృష్ణ వంటి వారు మాత్రం మంచు విష్ణుకి మద్దతు పలుకుతున్నట్టు వారు ఈ మధ్య కాలంలో చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో కులాల చీలిక వచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం పై నరేష్ క్లారిటీ ఇచ్చారు.’ ‘మా’ లో కులాల ప్రస్తావన ఉండదు.కులం పేరుతో రాజకీయాలకు ఇక్కడ చోటు లేదు. సినీ పరిశ్రమలో ఉన్న అందరిదీ ఒకే కులం,ఒకే మతం.ఇక్కడున్న నటుల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కులం గురించి ఆలోచించరు. అలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దు. నమ్మొద్దు.ఎవరు ఎవరికి మద్దతు పలకాలి అనేది వారి వ్యక్తిగత స్నేహాలు, ఆలోచనలు ప్రకారం జరుగుతాయి’ అంటూ నరేష్ క్లారిటీ ఇచ్చారు.