Naresh: నరేశ్ స్టామినా ఏంటో చూపించారు.. ఇదే కంటిన్యూ చేస్తే సూపర్!
July 7, 2023 / 01:54 PM IST
|Follow Us
వ్యక్తిగతాన్ని, వృత్తిగతాన్ని కలపకూడదు అంటారు. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. పర్సనల్ లైఫ్‌లో ఓ వ్యక్తి. ప్రొఫెషనల్ లైఫ్‌లో వ్యక్తికి అస్సలు సంబంధం ఉండదు. వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తిత్వం అని. దీనికి సినిమాల్లోకి అన్వయించి చెప్పొచ్చు. దీనికి రీసెంట్ ఉదాహరణ నరేశ్. ఇటీవల కాలంలో ఆయన వివిధ కారణాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజీ అయ్యింది.
కానీ, ‘సామజవరగమన’ సినిమా వచ్చిన తర్వాత ఆయనను చూసే విధానంలో మార్పు వచ్చిందని చెప్పాలి. నరేశ్ చాలా మంచి యాక్టర్ ఇందులో ఎలాంటి ప్రశ్నలకు తావులేదు. నటన అంటే ప్రాణం ఇచ్చే రకం కూడా. గతంలో సగటు హీరో చేయని, చేయడానికి ముందుకు రాని పాత్రలు వేశారు కూడా. ఇటీవల కాలం వరకు ఆయన చేశారు. అయితే ‘మా’ ఎన్నికలు, ఆ తర్వాత ఆయన కుటుంబ సమస్యలతో ట్రోలర్స్ బారిన పడ్డారు.
అయితే ‘సామజవరగమన’ చూశాక.. నరేశ్‌లో (Naresh) ఈ యాంగిల్ నటన కూడా ఉందా అంటూ తెగ మెచ్చేసుకుంటున్నారు. మొన్నటివరకు ఆయనను ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు వావ్ అంటున్నారు. అందులో ఆయన పాత్ర అంతలా పండింది మరి. పెళ్లి అయ్యి పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉండగా.. డిగ్రీ చదువుతున్న.. సారీ సారీ 30 ఏళ్లుగా చదువుతున్న వ్యక్తిగా నవ్వులు పూయించాడు నరేశ్. కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టించాడు.
అంతేకాదు ఈ సినిమాకు ముందు ‘అన్నీ మంచి శకునములే’లో హీరోయిన్ తండ్రిగా బాగా నటించి మెప్పించారు కూడా. ‘ఇంటింటి రామాయణం’లోనూ మంచి పాత్రే. అయితే ‘సామజవరగమన’లో ఆయన పాత్ర చిత్రణ అదిరిపోయింది. ఆస్తి కోసం డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నడి వయసులో పోరాడే టిపికల్ తండ్రి పాత్ర అది. ఈ పాత్రను చూశాక నవ్వని వారుండరు అని అంటున్నారు. ‘ఏమయ్యా అందరూ కామ్‌గా ఉన్నారు అని లెక్చరర్ అడిగితే.. ‘మేం బి.కామ్’ కదా సర్’ అని అంటాడు నరేశ్. మీరు కూడా చూసే ఉంటారు డైలాగ్.