Naveen Chandra: తండ్రి కాబోతున్న నటుడు నవీన్ చంద్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 14, 2023 / 02:50 PM IST

టాలీవుడ్ సెలబ్రిటీలు ఒకొక్కరుగా శుభవార్తలు చెప్తూ.. ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్, పేరెంట్ హుడ్, సీమంతం, బేబీ పుట్టడం.. ఇలా వరుసగా సంతోషకరమైన వార్తలు షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే నటి పూజా రామచంద్రన్ సీమంతం ఘనంగా జరిగింది.. ఇప్పుడు పాపులర్ యాక్టర్ నవీన్ చంద్ర తండ్రి కాబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పాడు.. దీంతో తనకు పెళ్లి అయిందని చాలా మందికి తెలియదు.. సడెన్‌గా సర్‌ప్రైజ్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు..‘‘బేబీ మూన్.. తల్లిదండ్రులం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది..

నిన్ను మా భుజాలపై నిన్ను మోసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాం.. న్యూ ఫేస్, న్యూ లైఫ్, న్యూ జర్నీ’’ అంటూ గోవా బీచ్‌లో భార్యతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నాడు. వాలంటైన్స్ డే నాడు గుడ్ న్యూస్ చెప్పావంటూ.. ఈ జంటకి విషెస్ తెలియజేస్తున్నారు..‘అందాల రాక్షసి’ తో కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకున్న నవీన్ చంద్ర ఇప్పుడు రామ్ చరణ్ – శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చాడు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus