Nithiin: నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే… డిమాండ్ చేసిన నితిన్!
December 4, 2023 / 04:25 PM IST
|Follow Us
హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎనిమిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు.
ఇక ఈ మూడో పాట విడుదల కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరు ఈ సినిమాలో నితిన్ నటించినందుకు డబ్బులు ఇచ్చారా అంటూ ప్రశ్న వేశారు. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి స్వయాన నితిన్ తండ్రి కావడం విశేషం. ఈ ప్రశ్నకు సుధాకర్ రెడ్డి సమాధానం చెబుతూ సినిమా విడుదలైన తర్వాత ఇస్తాను అంటూ సమాధానం చెప్పారు.
ఇలా నితిన్ తండ్రి రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో వెంటనే మైక్ తీసుకొని నితిన్ ఇప్పుడు అలాంటివి ఏమీ కుదరదు ఒకప్పుడు అంటే నాకు పెళ్లి కాలేదు కానీ ఇప్పుడు నాకు పెళ్లి జరిగింది కనుక నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందేనంటూ తన తండ్రిని డిమాండ్ చేశారు దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా నవ్వుకున్నారు. ఇలా తన తండ్రి నిర్మాణంలోనే తెరకెక్కుతున్నటువంటి సినిమాలలో నితిన్ ఇది వరకే నటించారు.
అయితే తన తండ్రి నిర్మిస్తున్నటువంటి సినిమాలకు నితిన్ డబ్బు తీసుకుంటారా లేదా అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతూ ఉంటాయి. ఇలాంటి సందేహాలు రావడంతోనే మీడియా ప్రతినిధులు ఈ ప్రశ్న వేయగా నితిన్ మాత్రం అప్పుడంటే ఓకే ఇప్పుడు కావాలి అనడంతో ఇదివరకు తన తండ్రి తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా తన తండ్రి విషయంలో (Nithiin) నితిన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.