యంగ్ డైరెక్టర్ తో కూతురు పెళ్లి ఫిక్స్ చేసిన ప్రభు?

  • November 28, 2023 / 08:14 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన కుమార్తె గురించి ఒక వార్త వైరల్ గా మారింది నటుడు ప్రభుకు ఇద్దరు పిల్లలు అమ్మాయి ఐశ్వర్య. అయితే ఐశ్వర్యకు త్వరలోనే ఈయన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో పెళ్లి చేయబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభు కుమారుడు విక్రమ్ ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.

తాజాగా ఈయన ఇరుకప్పపుట్టు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్గా (Adhik Ravichandran) అధిక రవిచంద్రన్ పనిచేశారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఐశ్వర్య అధిక్ మధ్య స్నేహం ఏర్పడిందని ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఐశ్వర్య కు ఇది రెండవ వివాహం కావటం గమనార్హం ఈమె 2009వ సంవత్సరంలోనే కునాల్ అనే తమ సమీప బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు కానీ తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు ఇచ్చారు కానీ ఈమె తిరిగి రవిచంద్రన్ తో ప్రేమలో పడటంతో ఈ విషయం తెలిసినటువంటి ప్రభు తిరిగి పెళ్లి చేయాలనే నిశ్చయించుకున్నారు. దీంతో ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తుంది . ఇక ఐశ్వర్య అధిక్ వివాహం డిసెంబర్ 15వ తేదీ జరగబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి

అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు అయితే త్వరలోనే ఈ విషయమై ప్రభు స్పందిస్తారని తెలుస్తుంది. ఇక అదిక్ విషయానికి వస్తే ఈయన ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇంత మంచి విజయం కావడంతో ఈయన అజిత్ తదుపరి సినిమాకి కూడా దర్శకత్వం వహించబోతున్నారని తెలిసిపోతుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus