Priyadarshi: భారీగా డిమాండ్ చేస్తున్న ప్రియదర్శి.. పారితోషికం ఎంతంటే?

  • April 7, 2023 / 07:49 PM IST

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన ప్రియదర్శి ఈ మధ్య కాలంలో హీరోగా కూడా విజయాలను అందుకుంతున్నారు. సీరియస్ రోల్స్ లో కూడా అద్భుతమైన నటనతో మెప్పించే ప్రతిభ ప్రియదర్శి సొంతమనే సంగతి తెలిసిందే. మల్లేశం, బలగం సినిమాల విజయాలతో సోలో హీరోగా ప్రియదర్శికి డిమాండ్ పెరిగింది. జాతిరత్నాలు సినిమా సక్సెస్ సాధించడంలో కూడా ప్రియదర్శి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సోలో హీరోగా ఒక్కో సినిమాకు ప్రియదర్శి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ మొత్తం కొంత ఎక్కువ మొత్తమే అయినా ప్రియదర్శికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రియదర్శి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎలాంటి పాత్రలో నటించినా ప్రియదర్శి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రియదర్శి (Priyadarshi) కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్నారు. భిన్నమైన కథలను ప్రియదర్శి ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రియదర్శికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రియదర్శి టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రియదర్శి రాబోయే రోజుల్లో కూడా భిన్నమైన కథలతో సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.

నటుడిగా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకోవడానికి ప్రియదర్శి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జనరేషన్ లోని బెస్ట్ కమెడియన్స్ లో ప్రియదర్శి ఒకరని చెప్పవచ్చు. ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటులు ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్లో నటిస్తే ప్రియదర్శి మరింత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus