Actor Pruthvi: పృథ్వీ విషయంలో ఆ హీరోలు అలా ప్రవర్తించారా?
September 26, 2022 / 11:54 AM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పృథ్వీ పెళ్లి, చెన్నకేశవరెడ్డి మరికొన్ని సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పృథ్వీ సీరియళ్లలో నటిస్తుండగా ఆ సీరియళ్ల ద్వారా కూడా పృథ్వీ మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ తాను సినిమాలకు దూరం కావడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కామెడీ రోల్స్ లో నటిస్తూ పృథ్వీ క్రేజ్ ను సంపాదించుకున్నారు.
వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమైన పృథ్వీ తాను సినిమాలకు దూరం కావడానికి డిప్రెషన్ కారణమని పేర్కొన్నారు. పెళ్లి పృథ్వీ అని చాలామంది ప్రేక్షకులు నన్ను పిలుస్తారని పృథ్వీ వెల్లడించారు. తాను చాలా సినిమాలలో నటించినా నటుడిగా సంతృప్తి లేదని ఆయన అన్నారు. మాకు ఒకే ఒక అబ్బాయని అబ్బాయి వయస్సు 27 సంవత్సరాలు కాగా మా అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదని పృథ్వీ చెప్పుకొచ్చారు. నా కొడుకు మాట్లాడలేడని ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
తొమ్మిది సంవత్సరాల పాటు డిప్రెషన్ వల్ల సినిమాలకు దూరంగా ఉన్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. కొంతమంది హీరోలు నేను నటించిన సినిమాలలో నా పాత్రలను కట్ చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయని పృథ్వీ తెలిపారు. సినిమాలో నా సీన్లు కట్ అయిన సమయంలో నేను ఎంతో బాధ పడ్డానని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు సైతం నా కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయని పృథ్వీ అన్నారు.
పృథ్వీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ జనరేషన్ లో కూడా పృథ్వీని అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.