R. Narayana Murthy: ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు!
June 28, 2021 / 11:35 AM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఉద్యమ సినిమాల హీరో ఆర్.నారాయణమూర్తి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు అయయారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో వారికి మద్దతుగా హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆ ర్యాలీలో ఆర్.నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు.
లోపలకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిలిపేశారు. ఆందోళనకారులను తిరిగి వెళ్లిపోమని పోలీసులు కోరారు. అయితే దీనికి ఆందోళనకారులు నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన వారిలో నారాయణ మూర్తి కూడా ఉన్నారు. ఆందోళన, అరెస్టు సమయంలో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఏ మాత్రం ప్రయోజనకారి కాదు. 2006లో బిహార్‌లో ఇలానే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారు.
దాని వల్ల అక్కడ మొత్తంగా రైతులే లేకుండా పోయారు. రైతు కూలీలుగా మిగిలి పోయారు. ఆ పరిస్థితిని గుర్తు చేసుకొని… కేంద్రం ఈ కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.