రావుగోపాల్రావు సతీమణి, రావు రమేష్ తల్లి కమలకుమారి మరణం
April 7, 2018 / 06:50 AM IST
|Follow Us
తెలుగు చిత్రసీమలో రావుగోపాల్రావు లేని లోటును తీరుస్తూ.. ఆయన పంధాలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్న రావురమేష్ ఇవాళ ఉదయం తన తల్లిని కోల్పోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రావుగోపాల్రావు సతీమణి కమలకుమారి నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. రావుగోపాల్రావు కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చిరంజీవి హుటాహుటిన కొండాపూర్ లోని రావురమేష్ గృహానికి వెళ్ళి.. కమలకుమారి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.