Ravi Krishna: ‘లవ్ మీ’ కోసం ‘పుష్ప 2’ వదులుకున్నాడట..!
May 24, 2024 / 08:07 PM IST
|Follow Us
రవికృష్ణ అందరికీ తెలుసు కదా..! ‘మొగలిరేకులు’ తో పాటు పలు హిట్ సీరియల్స్ లో నటించాడు. అయితే ‘బిగ్ బాస్ 3 ‘ తో ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సీజన్లో అతను విన్నర్ కాకపోయినా..తన మంచితనంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ఇతనికి ఛాన్సులు వచ్చాయి. కానీ ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాలో ఇతను చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎవ్వరూ ఊహించని షాకింగ్ రోల్లో అతను ఆ సినిమాలో కనిపించాడు.
ఆ సినిమా వల్ల అతనికి ఏకంగా ‘పుష్ప 2’ (Pushpa 2) వచ్చిందట. కానీ ‘లవ్ మీ’ (Love Me) సినిమా వల్ల అతను ఆ ఆఫర్ ను కాదనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా రవికృష్ణ చెప్పుకొచ్చాడు. రవికృష్ణ మాట్లాడుతూ… “నాకు ‘పుష్ప 2 ‘ లో ఛాన్స్ వచ్చింది. కానీ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల మిస్ అయ్యాను. దీంతో నేను చాలా బాధ పడ్డాను. ఓ పెద్ద మిస్ అయ్యాను అనే ఫీలింగ్ కలిగింది. అయితే ‘లవ్ మీ’ మేకర్స్ నాకు ఒక్కటే చెప్పారు.
‘ఈ సినిమా కోసం ‘పుష్ప 2 ‘ మిస్ అయ్యావు. ఓ పెద్ద ఆఫర్ వదులుకున్నావు. అయినప్పటికీ ఈ సినిమా కచ్చితంగా నీ కెరీర్లో మైల్ స్టోన్ గా మిగులుతుంది. అంటూ భరోసా ఇచ్చారు. నాకు కూడా అదే నమ్మకం కలిగింది.నన్ను నమ్మి ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.