Ravikishan: ఆమె మొదటి నుంచి నా దగ్గరే ఉంది… రవి కిషన్ కామెంట్స్ వైరల్!
April 3, 2023 / 12:25 PM IST
|Follow Us
ప్రముఖ నటుడు బిజెపి ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈయన భోజ్ పురి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రస్తుతం రవి కిషన్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా రవి కిషన్ ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు అత్యంత క్లిష్టతరమైన ప్రశ్న ఎదురైంది గతంలో ఈయన హీరోగా ఉన్న సమయంలో నటి నగ్మాతో రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు గురించి తాజాగా ఈ షోలో ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రవి కిషన్ షాకింగ్ సమాధానం చెప్పారు. నగ్మా స్థానం ఇద్దరం మంచి స్నేహితులమని తెలిపారు ఇలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటం వల్ల ఎక్కువ సినిమాలు చేశామని తెలిపారు.
అయితే మేమిద్దరం నటించిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ కావడంతో మా ఇద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు పుట్టుకొచ్చాయని రవికిషన్ తెలిపారు.కేవలం నగ్మాతో తనకు మంచి స్నేహబంధం మాత్రమే ఉందని తెలిపారు ఇక తనకు పెళ్లయి భార్య కూడా తనతో పాటు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రీతి శుక్ల అనే అమ్మాయిని తాను వివాహం చేసుకున్నానని అయితే తాను మొదటి నుంచి కూడా తనతోనే ఉందని తెలిపారు.
తన దగ్గర డబ్బులు లేకపోయినా తనని విడిచి వెళ్లిపోలేదని తనతో పాటే కష్టాలను అనుభవించిందని రవి కిషన్ (Ravikishan) వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో బాగా స్థిరపడిన తర్వాత కాస్త అహంకారంగా ప్రవర్తించాను. దీంతో తన భార్య తనకు బిగ్ బాస్ వెళ్లాలని సూచించిందని తెలిపారు.ఇలా బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత తనలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయని ఈ సందర్భంగా రవికిషన్ గుర్తు చేసుకున్నారు.
ఇలా నేను మారిన తర్వాత పూర్తిగా సెలబ్రిటీల మాదిరి కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా మారిపోయానని అప్పటి నుంచి తన భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్నానని తెలిపారు. ఇలా తాను తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ నాకు మాతో తనకు సంబంధం ఉంది అని వచ్చే వార్తలలో నిజం లేదని మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ ఈ సందర్భంగా రవికిషన్ క్లారిటీ ఇచ్చారు.