సినీ పరిశ్రమని వరుస విషాదాలు భయపెడుతున్నాయి. రోజుకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. నిత్యం సినీ పరిశ్రమకి చెందిన ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా తమిళ, మలయాళ , కన్నడ సినిమా పరిశ్రమలో లేదా హిందీ, బెంగాలీ.. అది కూడా కాదు అంటే హాలీవుడ్ నుండి ఎవరొకరు మరణించినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది అనారోగ్య సమస్యలతో, మరికొంత మంది వయసు మీద పడి, మరికొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని.. మరికొంత మంది అయితే గుండెపోటుతో మరణించడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా ఓ నటుడు.. తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర మహాజనీ అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో చచ్చి పడి ఉన్నాడు. పూణేలో ఉన్న తన ఫ్లాట్ లో 3 రోజుల క్రితం అతను చచ్చి పడి ఉన్నాడు. అయితే అతని ఇంటి నుండీ దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ఇంటివారు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా రవీంద్ర శవం కనిపించడంతో వారు షాక్ కు గురయ్యారు.
వెంటనే వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రవీంద్ర చనిపోయి 3 రోజులు అయినట్టు ధృవీకరించారు. అయితే అతనిది హత్యా.. ఆత్మ హత్యా? అనేది విచారణ పూర్తయ్యాక చెబుతామని తెలియజేశారు. రవీంద్ర వయసు 77 ఏళ్ళు కావడం గమనార్హం.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!