Siva Balaji: చిన్న గది కరెంటు కూడా ఉండేది కాదు… కన్నీటి కష్టాలు బయట పెట్టిన నటుడు!

  • May 17, 2023 / 12:38 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో సహాయ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన శివబాలాజీ నటి మధుమితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం శివబాలాజీ సినిమాలలో, వెబ్ సిరీస్ లో నటిస్తూ, ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలాజీ కెరీయర్ మొదట్లో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపారు.

తన (Siva Balaji) తండ్రికి చెన్నైలో ఫ్యాక్టరీలు ఉన్నాయని, తమ ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేస్తున్నారు అని తెలిపారు. అయితే తన తండ్రి కూడా తనని ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకోమని చెప్పారు. కానీ నాకు మాత్రం సినిమాలలో నటించడం చాలా ఇష్టం ఉండడంతో సినిమాలలోకి వెళ్తానని చెప్పి హైదరాబాద్ వచ్చానని తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు ఎలాంటి అవకాశాలు రాలేదని ఇదే విషయం మా నాన్నకు చెబితే చాలా కోపంగా అక్కడే ఉండు అంటూ ఫోన్ పెట్టేసారని తెలిపారు.

ఇలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 40 వేల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ డబ్బుతో ఒక చిన్న రూమ్ రెంట్ కి తీసుకున్నాను అందులో కరెంటు కూడా ఉండేది కాదని తెలిపారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం తినడానికి కూడా తిండి ఉండేది కాదని తెలిపారు.

భోజనం చేసేవాడిని మేలుకొని ఉంటే ఎక్కడ ఆకలి అవుతుందోనని తొందరగా పడుకొని చాలా ఆలస్యంగా నిద్రలేచే వాడినని శివ బాలాజీ తెలిపారు. నా కష్టాలు తెలుసుకున్నటువంటి నాన్న మా అమ్మను తన వద్దకు పంపించారని, అప్పుడు పెద్ద ఇల్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యామని తెలిపారు. ఇలా శివ బాలాజీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus