Suman: ఆడియో ఫంక్షన్ కి రూ.2 లక్షలు డిమాండ్ చేసిన సుమన్.. నిర్మాత తొందరపాటు వ్యాఖ్యలు!
June 24, 2023 / 10:01 PM IST
|Follow Us
సీనియర్ హీరో, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సుమన్ పై దర్శకుడు శివ నాగు చేసిన కామెంట్స్ ఇటీవల ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నట రత్నాలు చిత్రం ఆడియో ఫంక్షన్ కి సుమన్ ను గెస్ట్ గా ఆహ్వానిస్తే.. ‘పది రోజులు సాగదీసి, తర్వాత ఆయన మేకప్‌మెన్ తో “రెండు లక్షలు ఇస్తే ఫంక్షన్‌కి వస్తానని’ చెప్పమన్నట్టు,అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో సినిమా పరిశ్రమ ఉన్నట్టు’ శివ నాగు ఫైర్ అయ్యారు.
‘డబ్బులిచ్చి తమ సినిమా ఫంక్షన్లకి పిలిచి మరీ వాళ్ళని పొగడాల్సిన కర్మ దాపరించింది’ అని కూడా శివ నాగు వాపోయారు. అయితే అదే శివ నాగు ఇప్పుడు మాట మార్చేశారు. ఆయన మాట్లాడుతూ.. “సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి. ఆయనతో 3 సినిమాలు చేశాను. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్ టెన్షన్లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను.
దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటి వరకు నేను పొరపాటుగా మాట్లాడానన్న విషయం నేను గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను’’ అంటూ శివ నాగు చెప్పుకొచ్చారు. ఇక ‘నటరత్నాలు’ సినిమా ఫంక్షన్ కి సుమన్ (Suman) గెస్ట్ గా వచ్చి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.