Abhinaya: పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన అభినయ..!
October 31, 2022 / 02:09 PM IST
|Follow Us
ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని వార్తలు పుట్టుకొస్తాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ రేంజ్లో ఏ హీరో పై అయినా పెళ్లి వార్తలు వస్తాయా అంటే.. అది కచ్చితంగా హీరో విశాల్ పైనే అని చెప్పాలి. గతంలో నటి అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. కారణాలేంటో తెలీదు కానీ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అలాగే గతంలో విశాల్.. వరలక్ష్మీ శరత్ కుమార్ ల మధ్య ప్రేమాయణం నడిచినట్టు కూడా ప్రచారం జరిగింది.
అది కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. అనీషా తో విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత తన సినిమాల షూటింగ్లలోనే బిజీగా గడుపుతూ వచ్చాడు విశాల్. మొన్నామధ్య తన పెళ్లి గురించి స్పందించాడు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. ఆ అమ్మాయి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. తాజాగా నటి అభినయతో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై అభినయ ఫైర్ అయ్యింది.
ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “ప్రస్తుతం నేను విశాల్ హీరోగా నటిస్తున్న ‘మార్క్ ఆంటోనీ’ మూవీలో అతనికి భార్య పాత్ర పోషిస్తున్నాను. రీల్ లైఫ్లో భార్యగా నటించినంత మాత్రాన.. రియల్ లైఫ్ లో కూడా భార్యని అయిపోతానా? ఇలాంటి గాలి వార్తలు ఎలా పుట్టిస్తారు” అంటూ మండిపడింది. ఇక అభినయ మాట్లాడలేదు అలాగే ఆమెకు వినపడదు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనింతే’ చిత్రంతో నటిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత ‘కింగ్’ ‘శంభో శివ శంభో’ ‘సెవెంత్ సెన్స్’ ‘దమ్ము’ ‘ఢమరుఖం’ ‘జీనియస్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ధృవ’ ‘రాజు గారి గది 2’ ‘సీతా రామం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ కు దూరంగా ఉంటూ ఈమె కథకి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తుంటుంది.