Amrita Rao 2nd Marriage: మరోసారి పెళ్ళి చేసుకున్న అమృత రావు.. వైరల్ అవుతున్న వీడియో..!

  • March 19, 2022 / 03:26 PM IST

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2007 లో వచ్చిన మూవీ ‘అతిథి’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్లాప్ అయ్యింది. వీరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తుందా రాదా అనే విషయం మాత్రం ఇంకా తేలడం లేదు. ఇది పక్కన పెడితే.. ఈ చిత్రంలో మహేష్ స‌ర‌స‌న హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృతరావు నటించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆమె తెలుగులో కనిపించింది లేదు.

Click Here To Watch NEW Trailer

బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది అనంతరం అక్కడి రేడియో జాకీ అయిన అన్మోల్ సూద్ ను పెళ్ళి చేసుకుని సినిమాలని తగ్గించింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు.ఫస్ట్ లాక్ డౌన్ టైంలోనే ఈమె ఓ బిడ్డకి జన్మనిచ్చింది. కానీ తాజాగా ఈమె మరోసారి పెళ్ళి చేసుకుని వార్తల్లో నిలిచింది. అయితే కంగారు పడకండి ఈమె మళ్ళీ పెళ్ళి చేసుకుంది కూడా అన్మోల్ సూద్ నే..! గతంలో ఈమె అప్పుడప్పుడే హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు వెళ్తున్న తరుణంలో అన్మోల్ తో ప్రేమలో పడింది.

కొన్నాళ్ళకి ఈమెని పెళ్లి చేసుకుంటానని అతను ప్రపోజ్ చేసాడు. కానీ పెళ్ళి చేసుకుంటే తన కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అనే డైలమాలో పడిపోయింది అమృత రావు. అప్పుడు రహస్యంగా వివాహం చేసుకుందామని అన్మోల్ ఆమెకు సలహా ఇచ్చాడు. అలా వారు సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని తమ రిలేషన్ ను కొనసాగించారు. కానీ అనూహ్యంగా ఈమె సినిమాలకి దూరమైంది. ఓ సందర్భంలో అన్మోల్ ను తాను వివాహం చేసుకున్న రెండో రోజునే సినిమాలు ఆపెయ్యమన్నట్టు..

ఆ సందర్భంలో తెగ ఏడ్చినట్టు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. కానీ ఈమె బాధను అర్ధం చేసుకున్న అన్మోల్.. ఆమెని ఓదార్చి నీకు నచ్చిన పాత్రలు చేసుకోమని చెప్పాడట. అప్పటి నుండీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ దంపతులు పెద్దల సమక్షంలో రెండో సారి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పై అమృత ఆనందం వ్యక్తం చేస్తూ తబ్బుబ్బిపోతుంది.

1

2

3

4

5

6

7

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus