Anitha Chowdary: నిర్మాతగా మారి అవకాశాలను కోల్పోయాను!

  • October 5, 2023 / 03:54 PM IST

ఎన్నో సినిమాలలో అక్క పిన్ని పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనితా చౌదరి ఒకరు. ఈమె వెండితెర సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటిగా వెండితెర బుల్లితెర పైసందడి చేస్తూ ఉన్నటువంటి ఈమె నిర్మాతగా మారి కూడా పలు సీరియల్స్ చేశారు. అయితే నిర్మాతగా మారిన సమయంలో ఈమె ఎంతో నష్టపోయాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా అనిత చౌదరి (Anitha Chowdary) మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు అయితే అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈమె తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో నటించే అవకాశం ముందు తనకే వచ్చిందని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను మరొక సీరియల్ లో నటిస్తూ ఉండటం వల్ల ఈ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు.

ఇక సీరియల్స్ లో నటిస్తూ ఉన్నటువంటి నేను నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాను. నిర్మాణ రంగంలోకి రావడానికి మా ఇంట్లో వారు ఎవరు ఒప్పుకోలేదు కానీ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అన్ని వ్యవహారాలు తానే చూసుకునే దానిని దీంతో ఎక్కువ ఒత్తిడికి కూడా గురయ్యానని తెలియజేశారు. ఇలా నిర్మాతగా మారిన తరువాత తాను ఎంతో నష్టపోయానని ఈమె తెలియజేశారు.

ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా సీరియల్స్ చేస్తున్న సమయంలోనే నాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి కానీ నిర్మాతగా అన్ని వ్యవహారాలు నేనే చక్కదిద్దుకోవటం వల్ల ఈ సినిమా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని తద్వారా భారీగానే నష్టపోయాను అంటూ ఈమె తెలియజేశారు. ఇక తనకు చత్రపతి, సంతోషం నువ్వే నువ్వే ఉయ్యాల జంపాల వంటి సినిమాలు ఎంతో మంచి పేరు తీసుకువచ్చాయని ఈ సందర్భంగా ఈమె (Anitha Chowdary) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus