చెయ్యని తప్పుకి నన్ను చెట్టుకి కట్టేసి కొట్టారు.. మా అమ్మ కూడా ఆపలేదు : అన్నపూర్ణ
September 2, 2021 / 09:51 PM IST
|Follow Us
మోహన్ బాబు హీరోగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు నటి అన్నపూర్ణ. 1975వ సంవత్సరంలో వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈమెకు నంది అవార్డు కూడా లభించింది. అటు తర్వాత కూడా పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించారు. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఇక్కువైన తరుణంలో సహాయ నటిగా మారింది అన్నపూర్ణ. తల్లిగా, అత్తగా, పిన్నిగా, బామ్మగా ఎన్నో గుర్తుండి పోయే పాత్రలని పోషించారు అన్నపూర్ణ.
తెలుగులో ఈమె 144 కి పైగా సినిమాల్లో నటించింది. తమిళ్, మలయాళం,హిందీ, కన్నడ భాషల్లో కలుపుకుని మరో 11 సినిమాల్లో నటించింది. మొత్తంగా ఈమె 150 కి పైగా సినిమాల్లో నటించింది. అయితే అన్నపూర్ణ గారిని తన కన్న తల్లి ఎదుటే చెట్టుకి కట్టేసి మరీ కొట్టారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది. అన్నపూర్ణ మాట్లాడుతూ.. “నా చిన్నతనంలో హిందీ నేర్చుకోవడానికి ట్యూషన్ కు వెళ్లేదాన్ని. అక్కడ ఓ మాష్టారు ఉండేవారు. ఆ ఇంటి పక్కన ఉన్న ఓ అమ్మాయికి ఇవ్వమని నాకో ఉత్తరం ఇచ్చారు. అలా కొన్ని రోజుల పాటు నేను అతని దగ్గరనుండీ ఉత్తరాలు తీసుకోవడం.. ఆమెకు ఇవ్వడం జరిగేది.
ఓ సారి ఈ తంతు వాళ్ళ ఇంట్లో తెలిసింది.ఓసారి ఉత్తరం ఆ పక్కింటి అమ్మాయికి ఇస్తుండగా.. ఆమె ఇంట్లో వాళ్ళు దాన్ని లాక్కుని చదివారు. అందులో ఆ మాష్టారు, ఆ పక్కింటి అమ్మాయి పారిపోయి పెళ్లికోవాలని డిసైడ్ అయినట్టు రాసి ఉందట. దాంతో నన్ను చెట్టుకి కట్టేశారు. మా అమ్మకి ఈ విషయం చెబితే..’ఏం పర్లేదు కొట్టండి అలా కొడితే గాని ఇలాంటి ఎదవ వేషాలు వేయకుండా ఉండదు’ అంటూ మండిపడింది. ఆ సంఘటనతో నాకు జ్ఞానోదయం అయ్యింది.ఒకరి విషయాలు ఇంకొకరికి చేరవేయకూడదు అని.! మరీ ముఖ్యంగా పక్క వాళ్ళ విషయంలో అస్సలు కలగజేసుకోకూడదు అని.! ఆరోజు నుండీ ఈరోజు వరకు నేను ఎక్కువగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోను. నేను ఎవ్వరి మాటలు వినను.ఒకవేళ విన్నా.. ఎక్కడివి అక్కడే మర్చిపోతాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.