Actress Divi: ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు.. దివి కామెంట్స్!

  • July 8, 2021 / 12:28 PM IST

బిగ్ బాస్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఈ షోతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెకి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ టీవీ కేటగిరీలో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి మంచి పేరు సంపాదించడం కోసం చాలానే కష్టపడ్డానని చెబుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సిలకా ముక్కు దానా అనే ప్రైవేట్ సాంగ్ లో కనిపించింది.

ఇందులో తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాటకి ఇప్పటివరకు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇందులో దివి సరిగ్గా డాన్స్ చేయలేదని.. తనకు డాన్స్ రాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై దివి స్పందించింది. ఈ పాట కోసం, డాన్స్ కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసని.. ఇంత కష్టం ఎప్పుడూ పడలేదని చెప్పుకొచ్చింది. తనకు మోకాలి నొప్పులు వచ్చినా.. తట్టుకొని డాన్స్ చేసినట్లు చెప్పింది.

ఇక తన డాన్స్ పై వస్తోన్న విమర్శలను పట్టించుకోనని.. తనను ట్రోల్ చేసేవారికి ఈ పాట సాధించిన విజయం, వ్యూసే సమాధానం అంటూ చెప్పుకొచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను హారిక నారాయణన్ ఆలపించింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus