వైరల్ అవుతున్న ఈషా రెబ్బా బోల్డ్ కామెంట్స్..!

  • October 5, 2020 / 04:34 PM IST

ఈషా రెబ్బా.. ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ లేకపోయినా .. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన్నప్పటికీ.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఈషా. ఆ తరువాత ‘అమీ తుమీ’ ‘అ!’ వంటి చిత్రాలతో కుర్రకారుకి క్రష్ గా కూడా మారిపోయింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారుని ఆకర్షిస్తూ ఉంటుంది ఈషా. ఈ క్రమంలో.. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించి.. కొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఈషా మాట్లాడుతూ.. “షూటింగ్లో భాగంగా ఓ హీరో నన్ను ముద్దు పెట్టాలని ట్రై చేసాడు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.సీన్ వంకతో మళ్ళీ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసాడు.

అయినా నేను ఒప్పుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది ఈషా. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. దాంతో ఈషాకు ముద్దు పెట్టాలనుకున్న హీరో ఎవరై ఉంటాడా? అనే డిస్కషన్లు మొదలయ్యాయి.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus