Actress: నెటిజెన్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బోల్డ్ నటి..!
October 12, 2023 / 02:36 PM IST
|Follow Us
హిందీలో ఎన్నో సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించింది ఏక్తా కపూర్. నిర్మాతగా ఆమె ఫ్యామిలీ, రొమాంటిక్, ఎమోషన్స్ తో కూడుకున్న కథలతో సీరియల్స్ లో నటించడమే కాకుండా నిర్మించింది. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి అయిన ఏక్తా కపూర్ కి ‘బడే అచ్చే లగ్తీ హై’ ‘కుమ్ కుమ్ భాగ్య’ ‘కుండలి భాగ్య’ ‘యే మోహబ్బతేన్’ ‘కసమ్”తెరే ప్యార్ కి’ ‘క్యూంకీ సాస్ బీ కబీ బహు థి’ సీరియల్స్‌తో మంచి గుర్తింపు లభించింది.
సీరియల్స్ తో పాటు పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు ఏక్తా. విద్యాబాలన్ తో నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ కేవలం రూ. 10 కోట్లతో నిర్మింపబడి వంద కోట్లు వసూలు చేసి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘రాగిణి ఎమ్మెమ్మెస్’ ‘వీర్ దే వెడ్డింగ్’ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తా.అయితే ఈమె ఎక్కువగా శృంగార కథాంశంతో కూడుకున్న సినిమాలనే నిర్మిస్తూ ఉంటారు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..తన నెక్స్ట్ సినిమా ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈమె తన సోషల్ మీడియాలో నెటిజెన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెకు దారుణమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘నీ వల్ల ఎంతమంది యువత చెడిపోతున్నారో తెలుసా?’ ‘ఎంతో మంది విడాకులకు నీ సినిమాలే కారణం.. మంచి సినిమాలు చేయడం తెలుసుకో’ అంటూ కొంతమంది విరుచుకుపడ్డారు. వీటికి ఆమె (Actress) బదులిస్తూ.. ‘ నో అది నా ఇష్టం. నేను అడల్ట్ కాబట్టి.. అడల్ట్ కంటెంట్ సినిమాలే చేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది.