Esther Anil: బాయ్ ఫ్రెండ్ ఫోటో అంటూ షేర్ చేసి షాకిచ్చిన నటి ఎస్తేర్!
July 12, 2022 / 06:51 PM IST
|Follow Us
‘దృశ్యం’ సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఈ అమ్మాయి మొదటి చిత్రంతోనే తెలుగులో బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. లాక్ డౌన్ టైం లో వచ్చిన ‘జోహార్’ చిత్రంలో ఆమె నటించింది. కానీ విషయం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత ‘దృశ్యం 2’ లో ఆమె నటించింది.
‘దృశ్యం'(సిరీస్) లో వెంకటేష్ చిన్న కూతురిగా అల్లరి పాపగా ఈమె నటన ఆకట్టుకుంటుంది. ఈ రెండు సినిమాల్లో కథ మొత్తం మలుపు తిరిగేది ఆమె పాత్ర వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడి వయసు 21 ఏళ్ళు. అప్పుడే గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టేసింది. ఎస్తేర్ అనిల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఆల్రెడీ 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో ముచ్చటించి.. ఆమెకు ఎదురైన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చింది ఈ చిన్నది. ఈ క్రమంలో మీ బాయ్ ఫ్రెండ్ పిక్ ప్లీజ్ అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా అందుకు ఎస్తేర్ అనిల్.. తన కుక్క పిల్లతో దిగిన ఫోటోని తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి నా బాయ్ ఫ్రెండ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై తో తనకి బాయ్ ఫ్రెండ్ లేడు అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది ఈ బ్యూటీ.